KTR | తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్(Professor Jayashankar) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు(Tribute) అర్పించారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఉద్యమ సారథి కేసీఆర్ కి గురుతుల్యులు జయశంకర్ సార్ అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన జయశంకర్ తెలంగాణకు ఒక దిక్సూచి. వారి సేవలను గుర్తిస్తూ… జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విద్యాలయానికి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గౌరవించుకుందన్నారు. తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్ ని ప్రశంసించారు.
తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్… తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్.
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
ఉద్యమ సారథి కేసీఆర్… pic.twitter.com/wbzEEw3Pey
— KTR (@KTRBRS) August 6, 2026