మంథని, జూన్ 26: పోరాడి సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సస్యశ్యామలంగా మారిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి కరువు ప్రాంతంగా మార్చారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. నిండుకుండలా ఉన్న గోదావరిని ఎడారి గా మార్చిన ఘనత కూడా రేవంత్‌కే దక్కుతుందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బరాజ్ గేట్లను వెంటనే మూ సివేసి నీటిని నిల్వ చేయాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం మంథ ని శివారులోని గోదావరి తీరాన్ని పుట్ట మధూకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ ముందుగానే ఎల్‌నినో ప్రభావంతో ఈ యేడాది వర్షపాతం తకువగా ఉంటుందని హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని, మేడిగడ్డ బరాజ్ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేపట్టలేదని మండిపడ్డారు. జూలై వస్తున్నా గోదావరిలో నీటి నిల్వ లు లేక ఎడారిని తలపించే పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు గంగ స్నా నం చేయడానికి కూడా చెలిమెలు తవ్వుకునే దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల కంటే ఇసుక తవ్వకాలపైనే ప్రభు త్వం ఎకువ దృష్టి సారిస్తున్నదని విమర్శించారు. బోనస్‌ను ఏడు సన్న రకాలకే పరిమితం చేయడం వల్ల రైతులు నష్టపోతారని, నీటి కొరతతో ఈసారి వరిసాగు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్ర మాదం ఉందని వాపోయారు.తాగునీటి సమస్య కూడా తీవ్ర రూ పం దాల్చుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఏగోలపు శంకర్‌గౌడ్, మాచీడి రాజుగౌడ్, యాకుబ్, కనవేన శ్రీనివాస్, పెగడ శ్రీనివాస్, కుమార్, తిరుపతి, ఆసీఫ్, ఇర్ఫాన్ ఉన్నారు.