శ్రీనివాసమంగాపురంలో వైభవంగా రథోత్సవం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుందని ఆలయ పండితులు తెలిపారు. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదని, భక్తుల హృదయాల్లో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞమని అన్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారని వివరించారు.
ఫిబ్రవరి 19న చక్రస్నానం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం, ఉదయం 9.40 గంటలకు పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగుతుందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
Supreme Court | రక్తసంబంధ వివాహాలపై చట్టం అవసరం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

