జొన్న రైతుల బాధలు పట్టని సర్కార్
విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
- పంట మార్పిడి పాటించి జొన్నలు పండిస్తే కొనరా..
- నెల రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నారు..
- రాష్ట్ర మంత్రి తుమ్మలతో ఫోన్లో మాట్లాడిన పద్మాదేవేందర్‌రెడ్డి
- కేంద్రం కొనడం లేదంటూ దాటవేసిన మంత్రి తుమ్మల
రామాయంపేట, జూన్ 26 : విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి రైతులతో మాట్లాడారు.
నెల రోజులుగా తమ పంట కొనడం లేదని, తీసుకున్న జొన్నలను మట్టి పెళ్లల పేరిట తిరిగి లారీలను పంపించి వేశారని మాజీ ఎమ్మెల్యేతో మహిళా రైతులు గోడు వెల్లబోసుకున్నారు.రెండు నెలలు రోడ్లపై జొన్నలు ఆరబోస్తే, తీరా కొనకుండా వాపస్ పంపడం ఎంత వరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎస్సై బాలరాజును పిలిచి జొన్నలను సాధ్యమైనంత తొందరగా వెళ్లే ఏర్పాటు చేయాలని పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు.అక్కడి నుంచే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జొన్నల విషయమై ఫోన్లో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడారు.
జొన్నలను కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని మంత్రి దాటవేశారు.అనంతరం విలేకరులతో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడారు.రైతులు పంట మార్పిడి పాటించాలని ప్రభుత్వం చెబితే, వడ్లకు బదులు జొన్నలు పండిస్తే కొనక పోవడం సరికాదన్నారు. ప్రభుత్వం రైతుల విషయంలో ఇలాగే మొండిగా వ్యవహరిస్తే కలెక్టర్ ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెంట పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, సుధాకర్‌రెడ్డి, నగేష్, అబ్దుల్ అజీజ్, రాజు యాదవ్, నీల రాజు, కృష్ణాగౌడ్, మద్దెల రమేశ్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

