Srisailam | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం అంటే ఫిబ్రవరి 18 రాత్రి తొమ్మిది గంటల నుంచి 19 ఉదయం ఆరు గంటల వరకు భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 11 నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆది దంపతులను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు, వీఐపీలు తరలిల వస్తున్నారు. ఈ నేపథ్యంలో దోర్నాల నుంచి శ్రీశైలం వైపు భారీ వాహనాలను అనుమతించరు.
మహా శివరాత్రి మరునాడు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కర్నూల్లోని నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు, లారీ నిలుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులకు సహకరించాలని వాహనాల యజమానులకు సూచించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆది దంపతులను దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, ట్రాఫిక్ అంతరాయం ఈ చర్యలు చేపట్టామని ఎస్పీ కే రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. 18 నుంచి ఆత్మకూర్-దోర్నాల మీదుగా విజయవాడకు వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నట్లు తెలిపారు. 20 నుంచి వాహనాల రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు. కనుక వాహనాల యజమానులు తమ లారీలు, భారీ గూడ్స్ వాహనాలు 18 నుంచి 19 వరకు కర్నూల్లోని నంద్యాల చెక్‌పోస్ట్ నుంచి నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు వెళ్లాలని కోరారు.