హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ డిప్యూటీ ఫొటో జర్నలిస్టు వీరగోని రజినీకాంత్గౌడ్ తీసిన ఫొటోకు గుర్తింపు దక్కింది. ‘ట్రాఫిక్ జంక్షన్ జ్యువెల్స్ ఫొటో కాంటెస్ట్-2026’లో ఆయన మొదటి బహుమతిని సొంతం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో జరిగిన కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చేతుల మీదుగా రజినీకాంత్ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ మార్గంలో నార్సింగి-కోకాపేట్ రహaదారిలో పిల్లలు ఆడుకుంటున్న దృశ్యానికి ఈ అవార్డు దక్కింది.