పదవులు కాపాడుకునేందుకే వరుణయాగం
నాగార్జునసాగర్‌లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
- ప్రభుత్వం కండ్లు తెరిచి దేవునిపై వేస్తరా?
- రేవంత్ సర్కార్‌పై బొల్లం మల్లయ్యయాదవ్ ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 11(నమ స్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నీటి నిర్వహణలో ఘోరంగా విఫలమైందని, మానవ ప్రయత్నం చేయకుండా వర్షాలు కురువాలని దేవునిపై భారం వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నదని విమర్శించారు. ఎల్ నినో హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక లేకుండా, నీళ్లున్నా లిఫ్ట్ చేయకుండా రైతాంగాన్ని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన వాటాను వినియోగించుకోలేని అసమర్థ పాలన తెలంగాణలో సాగుతున్నదని మల్లయ్యయాదవ్ మండిపడ్డారు. రాష్ట్ర హకులను ఏపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తుంగభద్ర, భీమా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై రేవంత్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆరోపించారు. సొంత నియోజకవర్గానికి లిఫ్ట్ కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఉత్తమ్ సొంత జిల్లాకే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెకుల నీరు వృథాగా సముద్రంలోకి పోయినా చూస్తూ ఉండి, ఇప్పుడు వరుణయాగం పేరి ట దేవునిపై భారం వేయడం ఏంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల మీద ఉన్న ధ్యాస, రైతుల సంక్షేమంపై లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రవినాయక్, ఫ యాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

