హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ప్రజలకు వేగవంతమైన, నైపుణ్యంతో కూడిన న్యాయాన్ని అందించడంలో ట్రిబ్యునళ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయ ని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశా రు. ‘ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు-2026’పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ న్యాయస్థానాలపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ, పౌరులు, వ్యా పారవేత్తలు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారు లు, వినియోగదారులకు త్వరగా పరిషారం చూపేందుకు ఇవి ఉపకరిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, చట్టాల సఫలీకృ తం వాటి అమలు తీరుపైనే ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆలస్యమైన న్యాయం అంటే న్యాయం నిరాకరించబడటమేనని పేరొం టూ, ప్రస్తుతం అనేక ట్రిబ్యునళ్లలో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల కేసు లు పేరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు న్యాయం కోసం వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి రా కూడదని, ప్రజలకు అందుబాటులో ఉండేలా తగినన్ని ట్రి బ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఖాళీల భర్తీ అత్యవసరం
ట్రిబ్యునళ్లలోని ఖాళీలను తక్షణమే పారదర్శకంగా, కేవలం ప్రతిభ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ పూర్తి స్వతంత్రంగా, వృత్తిపరంగా పనిచేయాలని, క్రమం తప్పకుండా పనితీరును సమీక్షిస్తూ జవాబుదారీతనం పెంచాలని సూచించారు. ప్రతిపాదిత జాతీయ ట్రిబ్యునల్స్ డాటా గ్రిడ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించి, కేసుకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలని కోరారు.
సంసరణల్లో కేసీఆర్ మార్గదర్శకత్వం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందించిన సేవలను ఎంపీ వద్దిరాజు గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి, పరిపాలనను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లారని వివరించారు. న్యాయ, పరిపాలన, మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చిందని పేర్కొన్నారు.
సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్‌లో..
ఢిల్లీలో ‘సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్-2026’ కార్యక్రమానికి వద్దిరాజు హాజరయ్యా రు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, మాజీ మంత్రి పళ్లంరాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు హనుమంతరావు, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరై అక్టోబర్ 14,15 తేదీల్లో జరిగే సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ పోస్టర్లను ఆవిష్కరించారు.
పెట్రోలియం డీలర్ మార్జిన్‌ను వెంటనే పెంచాలి
ఎనిమిదేండ్లుగా పెరుగని డీలర్ మార్జిన్‌ను వెంటనే పెంచాలని, ఇతర న్యాయమైన డిమాండ్లను పరిషరించాలని కోరుతూ యునైటెడ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఢిల్లీలో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ సునీల్దత్తాత్రే తరరేకు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, స్థాయీసంఘం సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అసోసియేషన్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినోద్‌తోపాటు గుజరాత్, పశ్చిమబెంగాల్, కేరళ, బీహార్, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా రా ష్ట్రాల ప్రతినిధులు తరరే నివాసంలో సమావేశమై సమస్యలను వివరించారు.