మరికల్, మార్చి 16 : యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలుపడుతున్నారు. ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో భూగర్భ జలాలు పడిపోయి బోర్లు వట్టిబోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి శివారులో నీళ్లు లేక ఎండిపోయిన వరిని రైతు బోయ తిరుపతి పశుగ్రాసానికి వదిలేశాడు. తనకున్న రెండెకరాల్లో ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడి పెట్టి వరిసాగు చేసినట్టు వాపోయా డు. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోరులో నీళ్లు లేక చేతికొచ్చిన పంట ఎండిపోయింది. చేసేదేమీలేక పశువుల మేతకు వదిలాడు. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతు కంటతడి పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పాలనలో ఆదుకునేవారే లేరని ఆవేదన చెందాడు.