CM KCR BIRTHDAY | సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భారీ కేక్ కట్ చేసిన మంత్రులు
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR BIRTHDAY )పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR BIRTHDAY )పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీవీ మార్గ్ లోని థ్రిల్ సిటీ లో నిర్వహించిన వేడుకల్లో 69 కిలోల భారీ కేక్ను కట్ చేసి సంబరాలను నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరై సీఎం కేసీఆర్కు (CM KCR BIRTHDAY) శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కళాకారులు నిర్వహించిన ఆట పాట ఎంతగానో ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కళాకారులు రాజమౌళి, అప్పారావు, కార్తీక్, నవీన్, తన్మయి బృందం చేసిన కామెడీ కడుపుబ్బ నవ్వించింది. అదేవిధంగా కేసీఆర్ జీవిత చరిత్ర, రాజకీయ నేపథ్యంతో రూపొందించిన డాక్యుమెంటరీ సభికులు వీక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేషం, సురభి వాణిదేవి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుమార్, కోలేటి దామోదర్, సోమా భరత్ కుమార్ గుప్తా, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గ్యాదరి బాలమల్లు, రాంచందర్ నాయక్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

