Geetha Singh | హాస్యనటి గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం
Geetha Singh | ప్రముఖ హాస్యనటి గీతా సింగ్ (Geetha Singh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Geetha Singh | ప్రముఖ హాస్యనటి గీతా సింగ్ (Geetha Singh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘పిల్లలూ.. కారులో అయినా బైక్పై అయినా జాగ్రత్తగా వెళ్లండి. కమెడియన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓం శాంతి’ అని ఆమె పోస్ట్ చేశారు. విషయం తెలిసిన నెటిజన్లు, అభిమానులు గీతాసింగ్కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
నిజానికి గీతాసింగ్ (Geetha Singh)కు పెళ్లి కాలేదు. తన తోడబుట్టిన అన్న మరణించడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను ఆమె తీసుకున్నారు. వారితో పాటు మరో పాపను కూడా ఆమె సొంత బిడ్డలా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లలే తనకు జీవితమని.. తనకు ఇంకెవ్వరూ లేరని గీతాసింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే గీతాసింగ్ పెద్ద కుమారుడు తన స్నేహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

