అభివృద్ధి సాధనకై నడుం బిగించి సాగుతూ..
ఆర్థిక బలోపేతానికి దారులు వేస్తూ...
వెనుక బడిన మండలాల ఉన్నతి కాంక్షిస్తూ...
"పల్లె సమగ్ర సేవా కేంద్రాలు" స్తాపిస్తూ...
నాలుగు దెబ్బలు కొట్టినట్లే ఉండే
మా బతుకులు ఆనాడు..!
ఉప్పునీళ్లకే ఊరంత తిరిగినం...
కండ్ల నీళ్లతోనే మా ఇంటి కుండలు నిండేయి..
ఇంటి పెంకులు చూసింది
మేం తిన్న కంచంల కారం మెతుకులను..!