విముక్తి గీతం
అదిగదిగో ఇప్పుడక్కడ గంగ పొంగుతోంది నల్లాలో నీరు ఉత్తుంగ తరంగమై ఎగిసిపడుతోంది ఆ ముఖాలన్నీ తడితుంపరల సాక్షిగా విప్పారుతున్నాయి
అదిగదిగో ఇప్పుడక్కడ
గంగ పొంగుతోంది
నల్లాలో నీరు ఉత్తుంగ
తరంగమై ఎగిసిపడుతోంది
ఆ ముఖాలన్నీ తడితుంపరల సాక్షిగా విప్పారుతున్నాయి
ఒకప్పుడు ఆ ప్రదేశం నీటిచుక్కకై
నిలువునా ఎదురుచూసేది
మైళ్ళ దూరానున్న చెమ్మ కోసం
ఎడారి బీటలపై నడక సాగించేది
దొరికింది కలుషిత నీరైనా
కరువు పీడుతులకదే కానుకయ్యేది
పంటచేలు పొడి నాలుకలతో
వానచుక్కకై ఎదురు చూసేవి
మరి ఇప్పుడు..
దశాబ్దాల పోరాటంతో
ఏర్పరచుకున్న రాష్ట్రంలో
కనులారా కురుస్తుంది
కలలుగన్న జలసిరి
అధికారమందుకున్నదే తడవుగా
ముఖ్యమంత్రి చంద్రశేఖరుడు
కార్యనిర్వహణా దీక్షుడై
అపర భగీరధుడై
గోదావరి కృష్ణ జలాలకు
ఎడారి భూమికి చూపాడు
చెరువులను కుంటలను
జలసిరితో నింపాడు
ప్రకృతికి పచ్చదనపు రంగు అద్దాడు
త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా
కరువు పీడితుల గాథలకు
కలుషిత జల వనరులకు
ఫ్లోరైడ్ రాకాసి కోరలకు
విముక్తి గీతం పాడాడు
అందుకే…
ఇప్పుడిక్కడ చేలు
పచ్చదనపు రాగాలు తీస్తున్నాయి
ఇంటి నల్లాలు
స్వచ్ఛా గానాలు పాడుతున్నాయి
– విశ్వైక
సికింద్రాబాదు
9550183143
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

