జలమంటే.. మాయాజాలం కాదు మంత్ర ఫలం కాదు
శ్రీహరి పాదాలనుండి ఆపసోపాలు పడి..
భగీరథుడు భువిపైకి తెచ్చినది!
వ్యర్థ బుద్ధితో వృధా చేస్తే
భావితరానికి బతుకులుంటాయా!
అవనిలోని అడవులన్నీ మావే అన్నట్టు
నరకలోక కత్తులతో నరికేస్తున్నారు
లోకరక్షకులైన వృక్షాలే లేకుంటే
మేఘ మగువలెలా చినుకులిస్తాయి
జలాధారలు కుండపోతలై ఎలా కురుస్తాయి
కురిసే ప్రతి వానబొట్టునూ ఒడిసి పట్టేద్దాం
చెరువులూ బావులూ నింపుకుందాం
అడవులను నరకడం ఆపేసి..
మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు
కోట్ల మొక్కలను నాటుకోలేమా ఏకమై!
వనాలను పెంచి భావితరాలకు అందించలేమా
సృష్టిలోని అష్టదిక్పాలకుల సాక్షిగా
పంచభూతాలలోని నీరే ప్రధానం!
బిందువు బిందువును సింధువుగా మార్చుకుందాం
హరిత హారం లో
మనం పెంచుకున్న తరువుల మధుర ఫలాలను..
సంతోషంగా ఆరగిద్దాం!!
Y Manjulatha
– వై. మంజులత
సరూర్ నగర్
రంగారెడ్డి