సైరికోద్ధారక సంకల్పం
వజ్రసంకల్పం భూమి దున్ని బతికే రైతన్నకు ఆపన్నహస్తం ఆరుగాలం స్వేదజలంతో నేలతల్లిని సేచించే భూమిపుత్రునికి అభయహస్తం
వజ్రసంకల్పం
భూమి దున్ని బతికే రైతన్నకు
ఆపన్నహస్తం
ఆరుగాలం స్వేదజలంతో
నేలతల్లిని సేచించే భూమిపుత్రునికి
అభయహస్తం
పుడమి సిరిసంపదలకు
ఆదిమూలం వ్యవసాయం
పరిశ్రమలకైనా పరిశోధనలకైనా
మూలాధారం ఫలసాయం
ఢిల్లీకి మొదటి పౌరుడైనా
గల్లీ సఫాయి కర్మాచరణుడైనా
కూటిపాటు అనివార్యం
హలం సాగనిదే పొలం పండదు
పొలం పండనిదే కరువు తీరదు
ఆరుగాలం అన్నదాతకు రొష్టు తప్పదు
సైరికుని రెక్కాడనిదే జనుల డొక్కనిండదు
కర్షకునికి కష్టం కలిగితే గ్రహపాటు
తప్పదని
హలధరుడు అలిగితే అగచాట్లు తప్పవని
మర్మం తెలిసిన మహనీయుని
తలపు పొలంలో మొలచిన కొత్త వంగడం
రైతన్నకు చేయూత నివ్వడం
పేదరైతుకైన పెద్దరైతుకైనా
సేద్యం అను నిత్యసంకటం
ఉన్నదంతా ఊడ్చి భూమిలో పూడ్చి
చూపులన్నీ నింగివైపు నిగడ్చడం
వర్షం కురవకపోయినా బాధే
అతిగా కురిసినా బాధే
అకాలవర్షం ఆపదైరావచ్చు
చీడపీడలు చుట్టుముట్టవచ్చు
పంట చేతికందే వేళ ప్రభంజనం వీచవచ్చు
అన్ని అరిష్టాలు దాటి ఫలసాయం
ఇంటికి చేరేసరికి అప్పు ముప్పు రావచ్చు
అన్నీ ఒనగూడితే వ్యవసాయం
నల్లేరు మీదినడక
లేకుంటే మాత్రం పల్లేరు మీద పడక
రైతు కష్టం తెలిసిన నేత
రైతు క్షేమం అతని తలపోత
మార్చాలనుకున్నాడు రైతన్న తలరాత
అదే రైతుబంధు పథకం చేయూత
సాలుకు రెండు దఫాలు
పంటకాలానికి ఎకరాకు ఐదువేలు
అర్థిక సహాయం మంజూరు
బ్యాంకు ఖాతాలకు విడుదల ఖరారు
నవ తెలంగాణ ఆవిర్భావం
అన్నదాతకు అధినేత ఇచ్చిన వరం
అవనిపైనే అరుదైనదీ పథకం
ఈనాడు విశ్వానికి ఆదర్శప్రాయం

T.ram Mohan Rao
– తుమ్మూరి రాంమోహన్ రావు
11-5/173,St.No.5 (north),
Rayancha Avenue,
Peerzadiguda,Uppal
HYDERABAD-500 098
Telangana State,INDIA.
Cell.No.9701522234
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

