ఇష్టమే గాని
ఎందుకీ జన్మన్నట్టు ఆడపిల్ల కలుగుడే బాధల చెమ్మయినట్టు కలవరింతలు ఎవరికి పట్టి ?
ఎందుకీ జన్మన్నట్టు
ఆడపిల్ల కలుగుడే
బాధల చెమ్మయినట్టు
కలవరింతలు ఎవరికి పట్టి ?
ఆడుకొను పోతానంటే
వాకిట్ల తట్టు తాకెనా !
చదవ పోతుంటే
కిరాతకం కన్ను పడినా !
ర్యాగింగ్ నుంచి ర్యాగింగ్
అవమానం మీద అవమానం
చెరపెట్టిన చేదు యాదులన్నీ
వెనకకిడ్చి వెక్కిరీయబట్టే
గీత దాటనీయని ఆ అంక్షల నించి
విద్యనీయని పెత్తనాల నించి
గాయాలగేలి నించీ
అడుగు తీసి అడుగేస్తే
పుట్టెడనుమానాల నించీ
పల్లేరుల నడిచిన గుర్తుల వి
ఇంకెన్నాళ్లీ కష్టాలని
నూరు తప్పులు లెక్కించి ప్రభుత వరం
పాశుపతాన్నిచ్చింది
ఆపరేషన్ జురిడిక్షన్
ఎల్లలంతా కళ్ళు చేసుకుని
తోలు తీస్తున్నది ఖబర్దార్ !
‘ఎల్లప్పుడు మీతో
ఎల్లప్పుడూ మీ కొరకు ‘
గాలిస్తున్నది చూసుకో
– ఎ.ఎం. తాయారు
(9550 123 718)
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

