జన జీవన జలపాతపు వడి వేగం
జయహో తెలంగాణం జయహో తెలంగాణం
జయహో కళలకు మాగాణం జయహో తెలంగాణం
ప్రతినో్టా తుళ్ళిపడే ఆనంద సందోహం
ఊరూరా పరవశించు పాడుకునే జానపదం
నుడికారపు సొబగులై పలుకుబడుల సింగారం
జయహో తెలుగు ఠీవి జయహో మన కళల మాగాణం
అడుగడుగున తలలెత్తిన కవనం అష్ట దిగ్గజాలై వేల వేల కవి జనం
వీధి వీధినా పదచిత్రపు మల్లెలై విరిసే మొల్లలు
ఆసేతు హిమాచలం ఊరేగుతున్న అక్షర సముదాయం
జయహో కవనానికి ఆలవాలం జయహో తెలంగాణం
అరవై నాలుగు కళల హద్దులు అధిగమించి
ఇంటింటి వెలుగయే ప్రతి కళకూ
చేతికర్రై ఊత మిచ్చి నడిపించే సాంస్కృతిక సారథి .. కళాకారులకు వారధి
జయహో తెలంగాణం
జయహో సర్వ కళల కేతనం
-స్వాతి శ్రీపాద