రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి : ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు అన్నారు. శనివారం ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రౌడీషీటర్లు ఇకపై...
ఇల్లెందు, సెప్టెంబర్ 19 : నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు అన్నారు. శనివారం ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రౌడీషీటర్లు ఇకపై ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నేరాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
ఎవరైనా బెదిరింపులు, దాడులు, అక్రమ కార్యకలాపాలు లేదా ఇతర నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు తమ గత నేర చరిత్రను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవిస్తూ, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు సురేష్, సత్యనారాయణ, ఎస్ఐలు తిరుపతి, ఉమా, సారంగపాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

