హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పనిచేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, బావమరిది బాగోతాలను బయటపెడుతున్నందుకే ఈ నోటీసులపర్వానికి తెరలేపారని ధ్వజమెత్తారు. బొగ్గుగనుల కేటాయింపు కుంభకోణంలో సృజన్‌రెడ్డి బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉకిరిబికిరి అవుతున్నదని తెలిపారు. ఈ సామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్‌ట్యాపింగ్ పేరుతో పాత కథలను మళ్లీ తోడుతున్నారని విమర్శించారు. గతంలో ఫార్ములా-ఈ రేస్ విషయంలోనూ ఇలాగే ఏసీబీ నోటీసులతో హడావుడి చేసి ఏమీ నిరూపించలేకపోయారని గుర్తుచేశారు.
కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఓ నాటకం : నిరంజన్‌రెడ్డి
కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఓ నాటకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని కోర్టులు తేల్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలిరేకులు సీరియల్‌ను నడిపిస్తున్నదని మండిపడ్డారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రభుత్వం కేసులు పెట్టి నోటీసుల పేరుతో వేధిస్తున్నదని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ ఇంతకుముందే చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్తీరును గమనిస్తున్న ప్రజలు వారికి త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
తాటాకు చప్పుళ్లకు భయపడం : తలసాని
కక్ష సాధింపులో భాగంగా ఇచ్చే నోటీసులు, కాంగ్రెస్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడబోదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తేల్చిచెప్పారు. కేటీఆర్‌కు సిట్ నోటీసుల జారీ దుర్మార్గమని ఖండించారు. కుట్ర రాజకీయాలకు పరాకాష్ట అని అభివర్ణించారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేండ్లలో చేసిందేమీలేదని విరుచుకుపడ్డారు. పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరిట నాటకమాడుతున్నదని మండిపడ్డారు. ఎన్ని డ్రామాలు ఆడినా హామీలు అమలుచేసేదాకా వెంటపడతామని హెచ్చరించారు.
బొగ్గు మసి కడుక్కోలేకే కుట్రలు : వేముల
ఒంటికి అంటిన బొగ్గు మసిని కడుక్కొలేకే సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సిట్ నోటీసుల పేరిట కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నైని బొగ్గు బ్లాక్ లింక్‌లు బయటపడడం, తన బావమరిది సృజన్‌రెడ్డి బాగోతం బట్టబయలు కావడంతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల అమలు చేతగాక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కోల్ స్కామ్‌పై విచారణ జరుపాల్సిన బీజేపీ పెద్దలు మౌనం వహించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. నోటీసులు, బెదరింపులకు బీఆర్ఎస్, కేటీఆర్ భయపడబోదని తేల్చిచెప్పారు.
కక్ష సాధింపులో భాగమే నోటీసులు : సబిత
రాజకీయకక్ష సాధింపులో భాగమే కేటీఆర్‌కు సిట్ నోటీసులని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమిస్తే పవిత్రమైన ప్రజాస్వామిక యవనికపై రాజకీయ ధర్మం మరుగునపడి వ్యక్తిగత విద్వేషం జ్వాలగా మారుతున్నట్టు కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రక్షణకు మూలం కావాల్సిన అధికారం ప్రత్యర్థులపై ప్రతీకార పాశుపతాస్త్రం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అకారణంగా నోటీసుల అస్త్రాలు సంధించి నిందారోపణలపై బురద జల్లడం రాజనీతిజ్ఞత అనిపించుకోదని మండిపడ్డారు. కేటీఆర్ లాంటి యువనేతపై సిట్ అధికారులను పురమాయించి విచారణ వేదికలను రాజకీయ క్రీడాప్రాంగణాలుగా మార్చడం శోచనీయని పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతుకలపై కక్ష : సత్యవతి
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసుల డ్రామాలాడుతుంది అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహించారు. హరీశ్‌రావు మొదలు కేటీఆర్ వరకు వరుసగా సిట్ నోటీసులతో ప్రతిపక్షాన్ని భయపెట్టాలని చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరును ఆమె తప్పుబట్టారు. వారి వైఖరిని ఖండించారు. కాంగ్రెస్ అక్రమాలను బయటపెట్టుతున్నారనే అక్కసుతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఆమె విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, కేసీఆర్ సైనికులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే : శ్రీనివాస్‌గౌడ్
బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నోటీసులు ఇచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ని ప్రజాక్షేత్రంలో ఎదురోలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. తమ నాయకులు ఎలాంటి తప్పు చేయలేదని, ఎన్నిసార్లు సిట్‌కు పిలిచినా బాజాప్తా వస్తారని తెలిపారు.
స్కామ్‌పై నిలదీస్తే ఇంత కక్షనా?: లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బొగ్గు స్కామ్‌లో ఇద్దరు మంత్రులు, సీఎం బావమరిది పాత్ర ఉన్నదని, దానిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్‌కు నోటీసులు ఇస్తారా? అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఆరోపణలు వస్తే వారిపై సిట్ వేసి విచారణ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉన్నదా? అని నిలదీశారు.
కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్: పల్లా
జనగామ, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీస్ పేరుతో విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. సిట్లు, కమిషన్లు, విచారణల పేరుతో కేసులు పెట్టి జైళ్లకు పంపించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుకోలేరని అన్నారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలే: దాస్యం
హనుమకొండ, జనవరి 22 : హరీశ్‌రావును విచారణకు పిలిచిన మరుసటి రోజే కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం రాజకీయ కక్షసాధింపు చర్యలుగానే తెలంగాణ సమాజం భావిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేండ్లలో కమీషన్లు, నోటీసులు, సిట్, విచారణల పేరిట ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా వేధించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పాలన చేతకాక ప్రజల తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను కాంగ్రెస్ సరార్ టార్గెట్ చేస్తున్నదని మండిపడ్డారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలన చేతగాక రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌కు సిట్ నోటీసు ఇచ్చిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మొన్న హరీశ్‌రావుకు నేడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.
స్కామ్‌పై చర్చలను దారిమళ్లించేందుకే: దేశపతి
బొగ్గు కుంభకోణం మంటల నుంచి తన కుర్చీ కాపాడుకొనేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు సిట్ నోటీసుల పేరిట డ్రామా ఆడుతున్నారని మండలి లో బీఆర్ఎస్ విప్ దేశ్‌పతి శ్రీనివాస్ మండిపడ్డారు. రేవంత్ తన ఒంటికి అంటిన బొగ్గు మరకలను కేటీఆర్‌కు పంపించిన నోటీసులతో తుడిచేసుకోవాలని చూడటం వెర్రితనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. వేల కోట్ల స్కామ్‌లపై చర్చలను దారి మళ్లించేందుకే తుప్పుపట్టిన ఫోన్ ట్యాపిం గ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఎద్దేవాచేశారు.
ప్రజాసామ్యం ఖూనీ: శంభీర్‌పూర్
కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై కేసులు, విచారణ పేరిట కక్ష సాధిస్తున్నదని ఆరోపించారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిందని ధ్వజమెత్తారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ను భయపెట్టాలని చూడడం భ్రమేనని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డిది డైవర్షన్ డ్రామా: రోహిత్‌రెడ్డి
ఫ్రస్ట్రేషన్లో రేవంత్‌రెడ్డి చేస్తున్న మరొక డైవర్షన్ డ్రామానే బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నో టీసులు అని మాజీ ఎమ్మె ల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల గొం తు నొక్కాలని చూస్తుందని, ఎంతచూసినా అంతఎత్తున ఎగిసిపడటం ఖాయమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ను రాజకీయ సమా ధి చేస్తాం.. ఖబడ్దార్ అని హెచ్చరించారు.
దృష్టి మళ్లించడానికే నోటీసులు: మర్రి
మహబూబ్‌నగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజాపాలనను గాడి తప్పించి నోటీసుల మీద పాలిస్తున్నారు తప్ప.. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. బొగ్గు కుంభకోణంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న కేటీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఫోన్ ట్యాపింగ్ అని సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నదని, దీనివల్ల ఏం జరగదని ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌వి దిగజారుడు రాజకీయాలు: సుంకె
చొప్పదండి, జనవరి 22: కాంగ్రెస్‌కు పాలన చేతగాక బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇటీవల మాజీమంత్రి హరీశ్‌రావుకు, తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని దుయ్యబట్టారు.
ప్రభుత్వ కుట్రలో భాగమే : దేవీప్రసాద్
ప్రజా సమస్యలపై పోరాడుతున్న కేటీఆర్, హరీశ్‌రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగమే సిట్ నోటీసులని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన చేయాలని ప్రజలు తీర్పు ఇస్తే ప్రతీకార పాలనకు పాల్పడడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదని విమర్శించారు. రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదురోలేక కేసులతో ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
సర్కార్ బరితెగింపు: జూలూరు
ప్రభుత్వ బరితెగింపు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రముఖ రచయిత జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. అధికారపక్షం ప్రతిపక్షంతో కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగువర్గాలకు అందుతాయని తెలిపారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పునరాలోచించుకోవాలని, ప్రజలకు మేలుచేసే పనులపై దృష్టిపెట్టాలని సూచించారు.
డైవర్షన్ డ్రామా: గోసుల శ్రీనివాస్
ఎన్నికల ముందర కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు అమలు చేతగాకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్ ఆరోపించారు. కేటీఆర్‌కు సిట్ నోటీసుల పేరిట క్షుద్రరాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావును రాజకీయంగా ఎదుర్కొలేకే ఫోన్ ట్యాపింగ్ నోటీసుల పేరిట కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు.
అవమానంతోనే: శ్రీశైల్‌రెడ్డి
సర్పంచ్ ఎన్నికల్లో అవమా నం, మంత్రుల ఘెరావ్, ఎమ్మెల్యేల నిలదీత, సీఎం కుర్చీకి ఎస రు.. ఇవన్నీ తట్టుకోలేకే సీఎం రేవంత్‌రెడ్డి హరీశ్‌రావు, కేటీఆర్‌లకు నోటీసులు పంపాడని ప్ర ముఖ రాజకీయ విశ్లేషకుడు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని విమర్శించారు. రాహుల్.. ఇకనైనా మేల్కొని రేవంత్‌రెడ్డిని సాగనంపాలని హితవు పలికారు.
కక్షసాధింపు చర్యలు : ఎర్రోళ్ల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తప్పుబట్టారు. పాల న చేతకాకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరుకే దావోస్‌లో పర్యటిస్తున్నాడని, ఇక్కడ అక్రమ అరెస్టులు నడిపిస్తున్నాడని మండిపడ్డారు.
ఆరిపోయే దీపం: దూదిమెట్ల
రేవంత్‌రెడ్డి సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని, ఆరిపోయే దీపంలా ఆరోపణలు ఎక్కువగా చేస్తున్నారని, సిట్ విచారణ పేరుతో సీఎం డైరెక్షన్లో రోజుకోక డ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్ మండిపడ్డారు. సింగరేణి అక్రమాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు.
సర్కార్‌ది దురుద్దేశం: సతీశ్
కాంగ్రెస్ సర్కార్ దురుద్దేశపూర్వకంగానే కేటీఆర్, హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇస్తున్నదని బీఆర్ఎస్ నేత సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు అగ్రనేతలను కాంగ్రెస్ సర్కార్ వేధిస్తుందని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణంలో మంత్రులు అడ్డంగా బుక్ అయ్యారని, వాటిని మభ్యపెట్టేందుకే నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
నిలదీస్తున్నందుకే.. : మన్నె
బొగ్గు కుంభకోణం, మంత్రుల పంచాయితీ లు బయటపెట్టి బామ్మ ర్ది బాగోతం నిలదీస్తున్నందుకే కేటీఆర్‌కు రేవంత్ నోటీసులు ఇప్పిస్తున్నారని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్ భయపడే వ్యక్తి కాదని తెలిపారు.