నా తెలంగాణ ప్రగతి
కడివెడన్నీనీళ్లకోసం..గడియలేన్నో గడిసెనాడు బొట్టు నీటికి తల్లడిల్లి..ఎక్కిఏడ్చే వాళ్ళచూసి భగీరథుని దీక్షలోన..అపరభగీరథుడు అయ్యి
ఎన్నో ఎన్నెన్నో విజయాలమ్మ
నా తెలంగాణ పల్లెల్లోన
కడివెడన్నీనీళ్లకోసం..గడియలేన్నో గడిసెనాడు
బొట్టు నీటికి తల్లడిల్లి..ఎక్కిఏడ్చే వాళ్ళచూసి
భగీరథుని దీక్షలోన..అపరభగీరథుడు అయ్యి
పళ్లంలో పారెనీటిని..పైకితెచ్చి గొంతుతడిపెనో
గొంతు తడిపిన మిషన్ భగీరథే.
విశ్వమునకే ఆదర్శమాయేనో
మోడుపారిన బీడుభూమి..ఎడారికి జాడకాగా
తల్లిపిల్లలు వలసపోగా..వల్లకాడుగ పల్లెలవగా
శివుని శిరస్సునగంగవోలే. ఎత్తిపోతలే ప్రాజెక్టులల్లో
కాకతీయుల కాలమోలే..గొలుసుకట్టు చెర్లునింపిరి
గొలుసుకట్టు చెరువులే..
పల్లెలకు ఆదెరువులాయే
ఎదిగెఆడ పిల్లలుంటే..ఎదమీద కుంపటంటు
బాధపడె తల్లితండ్రి కి..బాసటగా ఉంటనంటు
కళ్యాణ లక్ష్మీ కబురు చెప్పి..కన్నవాళ్ల బాధతుడ్చి
కన్నకొడుకై కదిలి నాడో..వెన్నుదన్నై నిలిసినాడో
కళ్యాణ లక్ష్మీ పథకమే..
కలియుగాన పథాకమయ్యే
ఏరువాక సాగినాక..ఎరువుమందు విత్తనాలకు
అరువుకొరకు అయ్యలింటికి..రైతువెళ్లి అప్పుతేగ
వడ్డీమీద వడ్డీపెంచి..మిత్తికిందికి పంటగుంజగ
అసలు తీరక గుండెలాగిన.రైతుబిడ్డల కళ్ళచూసి
రైతుబందు ఇచ్చిరైతుల..
రాజుచేసిన ఘనతమనదే
మురుగుకాల్వ కంపు లేదు. అరుగుపై ఈగ దరువులేదు
అద్దమోలే ముద్దు ముద్దుగ.రోడ్లువెలిసెనో పల్లెబాదున
తడిచెత్త పొడిచెత్త..చెత్తబండి రోజుతీసెనో
పల్లెలేమో మల్లెలోలె..పరిమళించి ప్రకాశించేనో
పరిమళించిన తెలంగాణ..
ప్రపంచాన వెలుగువీణ
దివ్యాంగుల వృద్ధుల. వితంతువు ఒంటరి మహిళ
ప్రాణవాయువు లాగ..పింఛన్లు పంచినారో
చేతివృత్తుల వారికి.. చేయుతెంతో ఇచ్చినారో
వెలివాడల అభివృద్ధికి .వెలుగుకిరణం దళిత బందు
దళిత బందు దారినేడు..
ధరణిమూక్తికి ద్వారమాయనో
పల్లెపట్నం చుట్టుముట్టు.మొక్కలెన్నోనాటినారో
పచ్చనైన పర్యావరణం.పల్లెపల్లెన పరుచుకున్నదో
పూలసింగిడి జాలువారి..పల్లెతల్లి వడినిచేరెనో
పున్నమి నవ్వులవోలే.పచ్చని హరిత హారమాయే
హరితహారమే హారమాయేనో
తెలంగాణ తల్లి మెడలో

Kalwakole Maddileti
రచన:కల్వకోల్ మద్దిలేటి
9441590989..
maddiletipaatalu@gmail.com
H.no:17-55
Srinagar colony
Nagar kurnool (Post&Dist)
Telangana .
Pin:509209
Cell:9441590989
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

