‘ప్రజా రక్షకులు పోలీసులు’
నిరంతరం పరులకోసం ప్రాణాలను పణంగా పెడుతారు
ఆకలాపుకుని అల్లరి మూకల అణగదొకె ఆపద్బాంధవుడు
ఆలు బిడ్డల మరిచి జగతికి రక్షణనిస్తాడు
బంధు ప్రీతికి విలువ నివ్వక సత్యాన్ని గెలిపిస్తాడు
విధి నిర్వహణలో విరామమెరుగని కార్య దీక్షా తత్పరుడు
నేరస్థులను చీల్చి చెండాడే సింహ స్వప్నమతడు
అహరహం ప్రజల సంరక్షణకు కవచమతడు
శాంతి భద్రతల పరిరక్షణకు సారధుడు
ప్రజలతో మమేకమై స్నేహభావాన్ని చాటుతాడు
మహిళలపై జరిగే నేరాలను షీ టీమ్స్ తో చేధిస్తాడు
మూడు సింహాల్ని యూనిఫాం పై ధరించిన రక్షకుడు
పీడిత బాధిత ప్రజల జనని వీర పుత్రుడు
స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాలరాసే కింకరులకు యముడు
జనం గుండెల్లో గూడు కట్టుకున్న ఆత్మ బంధువుడు
న్యాయాన్ని కాపాడి ధర్మంగా నడవాలన్న మార్గదర్శకుడు
భరతమాత ముద్దు బిడ్డ భావితరాలకు వారసుడు
కనిపించని నాలుగో సింహమతడు
భరతమాత సిగలో విరబూసిన వీర పుష్పమతడు
అన్యాయమెచటవున్న రూపుమాపే శక్తియతడు
ప్రజలందరి బాగుకోరే రక్షణ కవచమతడు