కళ్యాణ లక్ష్మీ పథకం
పేదల ఇంటి దీపం అయింది
కాళ్ళ కింద చితికిపోయే
కలల స్వప్నానికి
సంజీవా పుల్ల అయింది!
పాముల్లా బుసకొట్టె కట్నాలకు
విరుగుడు మూలికైంది
ఆకులు రాలిన చెట్లకు
మల్లె తీగలా పెనవేసుకుంది
పెండ్లి కల వచ్చిన వధువు ఇండ్లలో
పూలై పూస్తుంది!
చిరునామా లేని ఉత్తరం కాదు
పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళ
భరోసా కవచం
జీవన గమనంలో
ఒక స్వప్న నౌక
ఒక మైలురాయి!
గతించి పోయిన బాధ
అనుభూతికి అందదు
కట్న కానుకల మధ్య
పెనుగులాడుతున్న కాలానికి
మానవత్వ మనిషైంది
బతుకును చితిగా రగిల్చే కట్నాలకు
గుండెను కాగడాలా వెలిగించింది!!
-ఎదిరెపల్లి కాశన్న
9640006304
గ్రామ ..చంద్రకల్
మండలం..పెద్దకొత్తపల్లి
జిల్లా.. నాగర్ కర్నూలు
Pin..509412