Adilabad RIMS | ఏసీల మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు : మాజీ మంత్రి జోగు రామన్న
ఏసీల మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు.
అదిలాబాద్ : అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నపిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీల మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి అదిలాబాద్ రిమ్స్‌ను సందర్శించారు. చిన్నపిల్లల వార్డులో ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిన్నారుల మరణం ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దవాఖానలో వసతులపై ప్రభుత్వానికి వినతులు అందించిన పట్టించుకోలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని సహాయం అందించాలన్నారు.
కాగా, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఓ పసికందు మరణించింది. చిన్నపిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వార్డులోని చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. వార్డులో సుమారు 30 మంది చిన్నారులు ఉండగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

