Raghav Juyal | ది ప్యారడైజ్’ ఈవెంట్లో రాఘవ్ జుయల్ మాస్ జోష్.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదరగొట్టిన విలన్
Raghav Juyal | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు పలువురు చిత్రబృంద సభ్యులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
Raghav Juyal | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు పలువురు చిత్రబృంద సభ్యులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం బాలీవుడ్ నటుడు, డ్యాన్స్ కళాకారుడు రాఘవ్ జుయల్. ‘ది ప్యారడైజ్’లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్న రాఘవ్ జుయల్.. ప్రీ రిలీజ్ వేడుకలో తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. వేదికపైకి వచ్చిన వెంటనే తన ప్రత్యేకమైన స్లో మోషన్ డ్యాన్స్‌తో సందడి చేశాడు.
ఈ కార్యక్రమంలో ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’ పాటకు రాఘవ్ జుయల్ తనదైన శైలిలో డ్యాన్స్ చేశాడు. ముఖ్యంగా అతని స్లో మోషన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాఘవ్ డ్యాన్స్ చేస్తుంటే అభిమానులు కేరింతలతో సందడి చేశారు. అంతటితో ఆగకుండా యాంకర్ సుమతో కలిసి ‘ఏషనాగుల కట్ట మీద’ పాటకు కూడా రాఘవ్ జుయల్ డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో రాఘవ్ జుయల్ చేసిన డ్యాన్స్ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు ప్రేక్షకులకు రాఘవ్ జుయల్ పెద్దగా పరిచయం లేకపోయినా.. హిందీ ప్రేక్షకులకు మాత్రం ఆయన సుపరిచితమే. అద్భుతమైన డ్యాన్సర్‌గా, వ్యాఖ్యాతగా, నటుడిగా రాఘవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
2009లో ప్రసారమైన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ మొదటి సీజన్ ద్వారా రాఘవ్ జుయల్ వెలుగులోకి వచ్చాడు. ప్రత్యేకమైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా నెమ్మదిగా చేసే డ్యాన్స్ కదలికలను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. డ్యాన్స్‌తో పేరు తెచ్చుకున్న రాఘవ్ జుయల్ ఆ తర్వాత నటుడిగానూ తన కెరీర్‌ను కొనసాగించాడు. 2014లో విడుదలైన ‘సోనాలి కేబుల్’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. అనంతరం పలు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించాడు.‘అభయ్’ వెబ్ సిరీస్‌లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి నటుడిగా మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘కిల్’, ‘యుధ్ర’ వంటి చిత్రాల్లోనూ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో తొలిసారి తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నాడు.
Out of syllabus వచ్చి, event మొత్తాన్ని Hijack చేసేశాడు!
మన young Telugu heroes నుంచి promotionsలో expect చేసే energy ఇదే (డాన్సే అవ్వక్కర్లా). కానీ చాలామంది fail అయ్యేదీ ఇక్కడే! ఒకప్పుడు VD స్టేజి ఎక్కితే ఇలానే ఉండేది ఎనర్జీ. #TheParadise ^ Raghav Juyal pic.twitter.com/TKBzp2onh4
— M9 NEWS (@M9News_) September 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

