నిర్మలాకాశం
పచ్చని పైర్లు
పంజరాలు లేని సమాజం…
పేగు బంధాలు
ప్రేమ బంధాలు
ఓ తోట లోని పూలు
మెరుపు
ఉరుము
మేఘం
అంతటా పరుచు కుంటుంది
సర్వసమానంగా కురుస్తుంది
నవసమాజం ఓ ఇంద్రధనస్సు
బుద్ధం సర్వకాలలశ్లోకం…
మురికిని చీడను
ముళ్లకంచెల కట్టు బాట్లను
ఇనుప గోడల దురాచారాలను
మంచి అభిమతం
మమతల ప్రేమ తుపానుకు
మాయం మాయం…
అవమానాలు బాధల నుండి
సత్యాన్వేషణ సంఘర్షణ నుండి
కొత్త క్రాంతి కాంతి శాంతి మార్గం
పుట్టింది దళిత ధీన జనోద్ధరణ కై
అది చూపుడు వేలై దారిచూపుతుంది
– రేడియమ్
ఫోన్.9291527757