Vande Mataram | మనస్సాక్షికి వ్యతిరేకంగా వందేమాతరం పాడలేమన్న వారిని శిక్షించలేం: సుప్రీంకోర్టు
TM Krishna | ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ వందేమాతరం పూర్తి ఆరు చరణాలను తప్పనిసరి చేస్తూ, అలా పాడని వారికి శిక్ష విధించేలా తెచ్చిన చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Vande Mataram | ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ వందేమాతరం పూర్తి ఆరు చరణాలను తప్పనిసరి చేస్తూ, అలా పాడని వారికి శిక్ష విధించేలా తెచ్చిన చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, మనస్సాక్షికి లేదా మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉందనే కారణంతో వందేమాతరం పూర్తి గీతాన్ని పాడటానికి నిరాకరించే వారిపై ఎలాంటి క్రిమినల్ లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
1986 నాటి చరిత్రాత్మక బిజోయ్ ఇమ్మాన్యుయేల్ కేసును ఈ సందర్భంగా గుర్తుచేసిన కోర్టు, మత విశ్వాసాలరీత్యా అభ్యంతరం తెలిపే వారిని బలవంతం చేయడం సరికాదని పేర్కొంది. వందేమాతరంలోని చివరి నాలుగు చరణాలలో హిందూ దేవతల ప్రస్తావన ఉందని, వాటిని అందరితో బలవంతంగా పాడించాలని చూడటం లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని పిటిషన్లో వాదించారు. జాతీయ గేయ స్వరూపంపై విధానపరమైన అంశాల్లోకి తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసినప్పటికీ, చట్టంలో ఉన్న శిక్షాత్మక నిబంధనలను మాత్రం పరిశీలిస్తామని తేల్చిచెప్పింది. ఈ వివాదాస్పద అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

