ఊరి చేతులు ఒక్కటై ప్రభుత్వానిది పెద్ద చెయ్యై
బడిని ధ్వజస్తంభం చేసిండ్రు
బాలదేవోభవ కదా!
రేపటి దేశాన్ని నిర్మించే
చిన్న సమాజం
పౌర సంపదను
పటిష్టపరిచే బడి బాగుంటే
ఊరు బాగుంటది
ఊరంటే దేశమే!
ఇప్పుడు బడి అంటే పెచ్చులూడిన గోడలు
అరకొర వసతులు కాదు వినూత్నహంగుల కలల ప్రపంచం
రంగుల బొమ్మల కోకో మిలన్
ఆటల పాటల చు చు టీవీ
ఇక్కడ పిల్లలు తమ కలలను విప్పార్చుకుంటారు
తమ జ్ఞానాన్ని అవపోసన పడతారు
ప్రయోగాల పసను ఆస్వాదిస్తూ కథల పుస్తకాలలో పదాల పదనిసలు వెతుకుతూ
తమ కౌశలాలకు పదును పెట్టుకుంటారు
ఆటంకం లేని చదువుకు
అన్ని వసతులను వడ్డిస్తూ బడిబాట
బాల్యానికి బంగారు బాట
చిన్ని రెక్కలు సంపాదనకు
బలి కాకుండా
బాల కార్మిక వ్యవస్థ అటకెక్కింది
ప్రతి చిన్నారికి భద్రత
బడిలోనే
డిజిటల్ పాఠశాల
బాల్యం పురివిప్పడానికి
పథకాల్లో మణిపూస.
Dr. Sarada Hanmandlu
– డా.శారదా హన్మాండ్లు
9912275801
3-10-305/3
న్యాల్కల్ రోడ్డు
వివేకానంద కాలనీ
నిజామాబాద్.503001.