Devadula | రెండేండ్ల క్రితం వరకు పచ్చటి పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్నది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో వానకాలం సాగు ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా సగం విస్తీర�
సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భూగర్భజలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భజలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి.
రోజురోజుకూ భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్నో ఆశలతో వేసిన పంటలకు సరిగా నీరందక రైతు కండ్ల ముందే ఎండిపోతున్నాయి. సరిపడా కరెంటు ఉన్నా.. బోరు బావుల్లో నీరు లేక రైతులు కన్నీరు పెట్టాల్సి వస్తున్నది.
కండ్ల ముందే పచ్చటి పొలాలు ఎండుతుంటే రైతుల గుండె మండిపోతున్నది. పంటలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడినప్పటికీ ఫలితం లేదు. దీంతో చేసేదేమీలేక పశువులను మేపుతున్నారు. జనగామ జిల్లాలో సకాలంలో దేవాదుల నీళ్ల�
పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కర్షకులకు పట్టించుకోవడమే మానేసి కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచుతున్నది. ఏడాది క్రితం నిండు కుండలా ఉన్న చెరువులు నేడు ఎడారిలా కనిపిస్తున్నాయి.
అసలు వేసవి ముందున్నా.. ప్రారంభంలోనే భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా వేగంగా నీటి మట్టం పడిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
పాలేరు జలాశయం ఏర్పడిన తరువాత ఈ తరహా నీటి కష్టాలు ఎన్నడూ రాలేదు. రిజర్వాయర్లోని నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతుండడం అటు అధికారులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
వర్షాల ప్రభావం.. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా బంద్ చేయడంతో జిల్లాలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడేండ్లపాటు వరుసగా భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించా రు.
సీఎం కేసీఆర్ కార్యదక్షత.. దూరదృష్టి.. వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ప