Suryakumar Yadav: ఇంటర్నేషనల్ క్రికెట్లో అయిదేళ్లు.. భావోద్వేగ పోస్టు పెట్టిన సూర్యకుమార్
Suryakumar Yadav: సూర్య భాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టి అయిదేళ్లు దాటింది. ఈ సందర్భంగా అతను తన ఎక్స్ అకౌంట్లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. గత స్మృతులతో కూడిన ఓ వీడియోను సూర్య రిలీజ్ చేశాడు.
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లోకి సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అడుగుపెట్టి అయిదేళ్లూ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ భావోద్వేగ పోస్టు పెట్టాడు టీమిండియా కెప్టెన్. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు భారత సారధిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ను అందుకున్న సూర్య తన పోస్టులో భారత జెర్సీని ధరించడం గొప్ప ఫీలింగ్‌గా భావిస్తున్నట్లు చెప్పాడు. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేనన్నాడు. తన ఎక్స్ అకౌంట్లో సూర్య ఓ వీడియోను షేర్ చేశాడు. అయిదేళ్ల క్రితం ఓ కల నిజమైందని, భారత జెర్సీని ధరించడం మాటల్లో వర్ణించలేనని, టీమిండియాకు ఎన్నో జ్ఞాపకాలు కలిగించినట్లు తన వీడియో పోస్టులో తెలిపాడు.
సూర్యకుమార్ 2021, మార్చి 14వ తేదీన అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంటరయ్యాడు. అప్పుడు అతని వయసు 30 ఏళ్లు 181 రోజులు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అతను అరంగేట్రం చేశాడు. అయితే అదే వేదికపై సూర్య తాజాగా టీ20 వరల్డ్‌కప్‌ను అందుకున్నారు. సూర్య తన టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 113 మ్యాచ్‌లు ఆడి, వాటిల్లో 3272 రన్స్ చేశాడు. దీంట్లో నాలుగు సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన మూడవ బ్యాటర్‌గా నిలిచాడు. అతనికంటే ముందు రోహిత్ శర్మ (4231), విరాట్ కోహ్లీ(4188) ఉన్నారు.
2021 జూలై 18వ తేదీన వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొలంబోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను వన్డే కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2023లో నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేశాడు. 2022లో ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్‌లో అతను 242 రన్స్ స్కోరు చేశాడు. బార్బడోస్‌లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన రోహిత్ జట్టులో సూర్య సభ్యుడిగా ఉన్నాడు.
5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳
Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ
— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

