U Visa | గ్రీన్ కార్డుల కోసం చోరీల డ్రామా.. 11 మంది భారతీయులు అరెస్ట్
U Visa | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై 11 మంది భారతీయుల (11 Indians) ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్‌కార్డుల (Green Cards) కోసం వీరు చోరీల డ్రామాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
U Visa : అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై 11 మంది భారతీయుల (11 Indians) ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్‌కార్డుల (Green Cards) కోసం వీరు చోరీల డ్రామాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దోపిడీ బాధితులం అంటూ కట్టుకథలు అల్లి ‘యూ-వీసా (U Visa)’ పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.
అయితే, హింసాత్మక నేరాల్లో బాధితులైన వారు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు యూ-వీసా (నాన్ ఇమిగ్రేషన్ స్టేటస్) కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాతో వలసదారులకు పని అనుమతులతో పాటు 5-10
ఏళ్లలో గ్రీన్‌కార్డు పొందేందుకు మార్గం దొరుకుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు వలసదారులు మోసాలకు పాల్పడినట్లు యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.
ఈ కేసులకు సంబంధించి మసాచుసెట్స్, కెంటకీ, ఒహాయో తదితర రాష్ట్రాల్లో 11 మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరంతా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో ఓ వ్యక్తిని భారత్‌కు డిపోర్ట్ చేయగా మరో ఆరుగురిని కోర్టులో హాజరుపర్చి విడుదల చేశారు. మిగతా నలుగురిని రిమాండ్‌లో ఉంచారు. నిందితులు ఓ ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఫాస్ట్‌ఫుడ్ రెస్టారంట్లు, మద్యం దుకాణాలు, స్టోర్ల వద్ద దోపిడీలు చేయించినట్లు తెలిపారు. అనంతరం ఈ ఘటనల్లో తాము బాధితులమంటూ నమ్మించి యూ వీసాలకు (U-Visa) దరఖాస్తులు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో నేర నిర్ధారణ అయితే నిందితులకు ఐదేళ్ల వరకు జైలుశిక్ష, 2.5 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

