చీకట్లో నీ మనసు జ్యోతివట్టి
వెలుగు రవ్వల్లో మేధస్సు సానవెట్టి
అక్షరాలకు ఆయువు పోస్తేనే
కొండచిలువలాంటి రహదారి కూడా
ఆకుపచ్చని పువ్వుల పరిమళమై
స్వాగతం పలుకతది..
కోణార్క్ సూర్య దేవాలయంలోని చక్రాన్ని ఎన్ఎస్ఎస్ చిహ్నంగా తీసుకున్నారు. ఇది జీవన గమనానికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సామాజిక మార్పు కోసం చేసే నిరంతర ప్రయత్నానికి చిహ్నం.
డెబ్బయి అయిదు ఏండ్ల స్వతంత్రభారతం ఇపుడు, రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి, సుస్థిరంగా పాలిస్తూ, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లగల ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నది.
వ్యక్త ప్రపంచం చిన్నది. దానికి ఆధారమై నడిపించే అవ్యక్త చైతన్య ప్రపంచం చాలా పెద్దది. ఇది ఆనాటి అంతర్ముఖీన రుషి హృదయం, ఈనాటి బహిర్ముఖీన విజ్ఞానం వక్కాణించే సత్యం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల దేశ ద్రవ్య లోటు రూ.లక్షల కోట్లకు చేరుకుంది. అంటే, దాని అర్థం ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువ, రాబడి తక్కువ అని.
అరక లేదు భూమి లేదు
కౌలుదారులు జీతగాళ్లుగా వెట్టి చాకిరీలు
ఎదిరిస్తే వీపుల మీద బండలు, వాతలు
జుట్టుకు పన్ను ఊరేగింపుకు హుకుమత్లు
తెలుగు భాష గొంతు పిస్కిన ఉర్దూ ఫర్మానాలు