New Ocean | చీలిపోతున్న ఆఫ్రికా.. 50 లక్షల ఏండ్లలో కొత్త మహా సముద్రం
New Ocean | ప్రపంచ పటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా ఆఫ్రికా ఖండం చీలిపోతున్నది. తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల (భూమి ఫలకాల) కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడబోతున్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు.
New Ocean | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ పటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా ఆఫ్రికా ఖండం చీలిపోతున్నది. తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల (భూమి ఫలకాల) కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడబోతున్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. అయితే, వాళ్లు ఊహించిన దాని కంటే వేగం గా ఈ పరిణామం జరుగుతున్నట్టు తాజాగా వెల్లడైంది. రానున్న 50 లక్షల ఏండ్ల నుంచి కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యి.. భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం ఉన్నట్టు నాసా, అమెరికా జియోలాజికల్ సర్వే, యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకుల బృందం తెలిపింది.
హిందూ మహా సముద్ర నీటితో..
ప్రస్తుతం భూమిపై పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహా సముద్రాలు ఉన్నాయి. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్ వరకు విస్తరించి ఉన్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని భూ అంతర పొరల్లో రాపిడిల వల్ల నుబియన్ టెక్టానిక్ ప్లేట్ నుంచి సోమాలియన్, అరేబియన్ టెక్టానిక్ ప్లేట్స్ విడిపోతున్నాయని, దీంతో ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ హిందూ మహా సముద్రం నీటితో కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇథియోపియా, కెన్యా లాంటి ప్రాంతాల్లో భూమి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

