Paneer | మీ ఇంట్లోనే పనీర్‌ను ఫ్రెష్‌గా తయారుచేసుకోండి!
Paneer | రుచిని పంచుతూ, ఆరోగ్యం పెంచే పదార్థం పనీర్. ఒక్క పనీర్‌తో రుచికరమైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. పనీర్ వండుకుందామని అనుకోగానే.. మార్కెట్‌కు పరుగులు తీస్తుంటాం. అయితే మార్కెట్లో పనీర్ కల్తీ జోరుగా సాగుతున్నది. ఏదిపడితే అది తీసుకొచ్చి వండుకుంటే ఆరోగ్యానికి బదులు అనారోగ్యం పాలవ్వడం ఖాయం.
Paneer | రుచిని పంచుతూ, ఆరోగ్యం పెంచే పదార్థం పనీర్. ఒక్క పనీర్‌తో రుచికరమైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. పనీర్ వండుకుందామని అనుకోగానే.. మార్కెట్‌కు పరుగులు తీస్తుంటాం. అయితే మార్కెట్లో పనీర్ కల్తీ జోరుగా సాగుతున్నది. ఏదిపడితే అది తీసుకొచ్చి వండుకుంటే ఆరోగ్యానికి బదులు అనారోగ్యం పాలవ్వడం ఖాయం. అలాకాకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, మృదువైన పనీర్ తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే.. మారెట్ స్టయిల్ పనీర్ కోసం ముందుగా పాన్‌లో కొంచెం నీరు పోయండి. అందులో 2 లీటర్ల ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్ పోసుకోండి. ఇప్పుడు పాలను స్టవ్ మీద ఉంచి ఎకువ మంట మీద మరిగించాలి. అప్పుడప్పుడూ చెంచాతో కలుపుతూ.. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు పాలు విరగడానికి వెనిగర్, నీరు కలిపి మరిగిన పాలలో పోయాలి. ఇప్పుడు పాలు విరగడం మీరు గమనించవచ్చు. అది జున్నులా కనిపిస్తుంది. విరిగిన పాలలో కొద్దిపాటి చల్లటి నీళ్లు పోయాలి. ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంతో విరిగిన పాలను వడకట్టుకోవాలి. అలా మిగిలిన జున్నును వస్త్రంలోనే ఉంచి ఆ మూటపై కాస్త బరువు పెట్టి.. 30 నిమిషాల పాటు అలాగే పెట్టాలి. తర్వాత.. వస్త్రం నుంచి పనీర్‌ను తీసి, ముక్కలుగా కట్ చేసుకుంటే సరి. మీరు వండుకున్న తర్వాత మిగిలిన పనీర్‌ను ఒక పాత్రలో వేసి, అందులో నీళ్లు నింపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. వారం రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Cream Mill
- Fresh Paneer
- Health
- milk
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

