Kitchen Tips | మీ కిచెన్‌లో వీటిని అస్సలు కలిపి ఉంచకండి!
Kitchen Tips | వంటింట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలు ఉల్లిపాయలు, ఆలుగడ్డలే! అందుకే, తక్కువ ధరలో దొరికినప్పుడు వీటిని ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే, వాటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. దాంతో అవి త్వరగా పాడైపోతుంటాయి.
Kitchen Tips | వంటింట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలు ఉల్లిపాయలు, ఆలుగడ్డలే! అందుకే, తక్కువ ధరలో దొరికినప్పుడు వీటిని ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే, వాటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. దాంతో అవి త్వరగా పాడైపోతుంటాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాల్సిందే!
- ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలను ఒకే బుట్టలో, పక్కపక్కనే ఉంచకూడదు. ఎందుకంటే.. ఉల్లిపాయలు ‘ఇథిలీన్’ అనే వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువు వల్ల ఆలుగడ్డలు త్వరగా మొలకెత్తుతాయి. మెత్తబడి కుళ్లిపోతాయి.
- ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. అలా చేస్తే.. ఆలుగడ్డల్లో ఉండే స్టార్చ్.. చక్కెరగా మారిపోతుంది. ఇలాంటి వాటిని వండుకొని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెడితే.. మెత్తగా, జిగురుగా మారిపోతాయి.
- ఆలుగడ్డలకు నేరుగా ఎండ తగిలితే ఆకుపచ్చగా మారుతాయి. అలా రంగు మారిన ఆలుగడ్డల్ని తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే! అందుకే.. వీటిని చీకటిగా ఉండే పొడి ప్రదేశంలోనే ఉంచాలి.
- ఉల్లిపాయలకు గాలి ఎక్కువగా తగిలితే అవి తాజాగా ఉంటాయి. తేమ లేని ప్రదేశంలో వీటిని నిల్వ చేయాలి.
- ఇక ఈ రెండిటికీ నిత్యం గాలి తగిలేలా చూడాలి. రంధ్రాలు కలిగిన బుట్టలు, జ్యూట్ బ్యాగులలోనే నిల్వ చేయడం మంచిది. అలా కాకుండా ప్లాస్టిక్ కవర్లలో ఉంచితే.. లోపల తేమ పెరిగి కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

