Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి ఆమె 1300కుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Telangana Assembly Elections | కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 5వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి 4,747 ఓట్లు వచ్చాయి.
Telangana Assembly Elections | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. 14వ రౌండ్లో బీఆర్ఎస్ 5253 ఓట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మొత్తం 44218 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 7,221 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సరిత కంటే 1154 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో బీఆర్ఎస్ లీడింగ్‌లో ఉంది.
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయ�