Leopard | అర్పనపల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్కసారిగా కలకలం
Leopard | మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రామ శివార్లలోని ఓ గ్రానైట్ క్వారీ వైపు ఉన్న తన వ్యవసాయ భూమి వద్ద చిరుతపులి కనిపించిందని గండికోట కుమార్ అనే రైతు గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం దగ్గర దూరంగా చిరుతపులి కనిపించిందని కుమార్ చెప్పాడు.
Leopard : మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రామ శివార్లలోని ఓ గ్రానైట్ క్వారీ వైపు ఉన్న తన వ్యవసాయ భూమి వద్ద చిరుతపులి కనిపించిందని గండికోట కుమార్ అనే రైతు గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం దగ్గర దూరంగా చిరుతపులి కనిపించిందని కుమార్ చెప్పాడు. ఆ పులిని చూసి తీవ్ర భయాందోళనకు గురైన తాను పెంపుడు కుక్కతో సహా సమీపంలోని ఒక బావిగుంతలో దాక్కున్నానని వెల్లడించాడు.
అంతకుముందు పులి వెళ్లిపోయిన తర్వాత తన పొలంలోని పాదముద్రలను ఫోన్లో ఫోటో తీసి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పెట్టాడు. దాంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా పులి తనకు గత రెండు రోజులుగా కనిపిస్తున్నట్లు కుమార్ చెప్పాడు. ఇదిలాఉండగా మూడు రోజుల క్రితం గూడూరు మండలం బొల్లెపల్లి ప్రాంతంలోనూ చిరుత కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. అయితే అటవీశాఖ అధికారులు వెతికినప్పటికీ పులిజాడ కనిపించలేదని తెలిసింది.
ఈ విషయంపై అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ.. అర్పనపల్లిలో పులి పాదముద్రలు లభించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారని, ఇది అడవిపిల్లి పాదముద్రలు కూడా అయి ఉండవచ్చునని అన్నారు. కాగా ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపుతామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

