ఉన్న బస్సులతోనే అటూ.. ఇటూ..
పెరుగుతున్న నగర జనం రాకపోకలకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఓ వైపు విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు. కొంతమంది విద్యార్థులు ఏకంగా నగర బస్టాండ్లలో సర్వే చేసి బస్సులు పెంచాలని రిపోర్ట్ అందించారు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.
- పండుగలు, డిమాండ్ ప్రాంతాలకు కేటాయింపు
- బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికుల డిమాండ్
- నగరంలో బస్సులు సరిపోవడం లేదంటున్న ప్రయాణికులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న నగర జనం రాకపోకలకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఓ వైపు విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు. కొంతమంది విద్యార్థులు ఏకంగా నగర బస్టాండ్లలో సర్వే చేసి బస్సులు పెంచాలని రిపోర్ట్ అందించారు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఇప్పటికీ నగరంలో ఉన్న 3200 బసులపైనే నగరవాసుల రాకపోకలు ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలో చాలా రద్దీ రూట్లల్లో బస్సుల ప్రీక్వెన్సీ సరిపడా ఉండటం లేదు.
ఓయూ నుంచి కోఠి మహిళా విశ్వవిద్యాలయం వరకు బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బస్సుల సంఖ్య పెంపునకు బదులు ఉన్న బస్సులతోనే ఆదివారం నుంచి ప్రీక్వెన్సీ పెంచుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఉచిత బస్సులు ఇప్పటికే మహిళలతో రద్దీగా మారాయి. ఈ క్రమంలో బస్సెక్కాలంటే వయోవృద్ధులు జంకుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం బస్సుల్లో వేలాడుతూ ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో వయో వృద్ధులు బస్సు ఎక్కాలంటే సాహసించాల్సి వస్తోంది. తమకు కేటాయించిన ఒక సీటు కూడా మహిళలే కూర్చొంటున్నారని, లేవాలని కోరితే గొడవకు దిగుతున్నారని వృద్ధులు చెబుతున్నారు. సాధారణంగా సీట్ల కేటాయింపులో ఆర్టీసీ 40 శాతం కేవలం మహిళలకే కేటాయించింది. మిగిలిన 60 శాతంలోనూ మహిళలతోపాటు పురుషులకు కేటాయించారు. దీంతో బస్సులన్నీ మహిళలతోనే కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 8-10, సాయంత్రం 5-8 గంటల వరకు బస్సులు కిటకిటలాడుతున్నాయి. గ్రేటర్లోని 25 డిపోల నుంచి నడిచే 2900 బస్సులు ఇలానే దర్శనమిస్తున్నాయి.
ఎన్నో ఇబ్బందులు..
దూర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని ఈశ్వరి అనే ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయని, ఎక్కువ సమయం నిల్చొలేనని పేర్కొంది. బస్సు రద్దీగా ఉంటే సీటు తమకు ఎవ్వరూ ఇవ్వడం లేదని వాపోయింది. ఉచిత బస్సుతో వయోవృద్ధులకు ఏం లాభం లేదని వివరించింది. వయో వృద్ధులకు బస్సులో సీట్లు ఎక్కువగా కేటాయించాలని, ఆ సీట్లలో వాళ్లే కూర్చునేల కండక్టర్లు చర్యలు తీసుకోవాలని మరో ప్రయాణికుడు నాగేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
డిమాండ్ మేర బస్సులు కల్పించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండటం వల్లే వయోవృద్ధులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వివరించారు. సాధారణంగా లింగంపల్లి- సికింద్రాబాద్, శామీర్పేట్ -సికింద్రాబాద్, కోఠి- పటాన్చెరు, ఉప్పల్- మెహిదీపట్నం, ఘట్కేసర్- సికింద్రాబాద్, హయత్నగర్-కోఠి తదితర మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ మార్గాల్లో విద్య, ఉపాది, వ్యాపారాల నిమిత్తం లక్షలాది మంది ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తున్నారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
6వేల బస్సులు అవసరం
బస్సుల కోసం ఎదురుచూడలేక ఓలా, ఉబర్, ర్యాపిడోలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంటుంది. ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఆన్లైన్ ఆధారిత వాహన కంపెనీలు రెట్టింపు ధరలను వసూలు చేస్తున్నాయి. మరోవైపు గ్రేటర్లో ఉచిత బస్సుకు ముందు రోజుకు 11 లక్షల మంది ప్రయాణం చేసేవారు. ఇందులో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవారు. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక నేడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. ఒక్క రోజుకు ఇంత మంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 3200 బస్సులపైనే ఆధారపడి ఉంది. రోజుకు 30వేల ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ప్రతీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. మరో 6 వేల బస్సులు సమకూర్చాల్సిన అవసరం ఉందని రవాణారంగ నిపుణులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

