Bomb Threat : శంషాబాద్ విమానాశ్రయం నుంచి భోగాపురం వెళ్తే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉండగానే దుండగులు ఈ బెదిరింపు మెయిల్ పంపించారు. దాంతో వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెదిన అధికారులు బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేశారు.
ఎయిర్‌పోర్టు అంతటా అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు బాంబు బెదిరింపు మెయిల్‌పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.