– పాతబస్తీ విగ్రహం ప్రాధాన్యత తగ్గిస్తున్నారని ఆవేదన
– విగ్రహాల వద్దకు వెళ్లకుండా పోలీసులు అత్యుత్సాహం
– నల్లగొండ మాజీ ఎమ్మేల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మండిపాటు
రామగిరి, సెప్టెంబర్ 23 : వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. వేములపల్లి కాల్వలో 10 ఫీట్ల విగ్రహాలను నిమజ్జనం చేయాలని పోలీసులు తెలిపినా అందులో నీళ్లు లేవని తెలిపారు. బుధవారం నల్లగొండ పాతబస్తీ మొదటి విగ్రహం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు,శేష వస్త్రాన్ని అందించి వేదాశీర్వచనం చేశారు. అనంతరం కంచర్ల మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం వినాయక నిమజ్జోత్సవ ఏర్పాట్ల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 10 ఫీట్లపైన విగ్రహాలను వేములపల్లి వద్ద నిమజ్జనానికి ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడ అడుగు లోతు కూడా నీళ్లు లేవని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే నీటి విడుదలకు ఏర్పాటు చేయాలని కోరారు. అత్యంత ప్రాధాన్యమున్న పాతబస్తీ మొదటి విగ్రహానికున్న, ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. అధికార పార్టీ నాయకులకు రాజకీయ వేదికగా మార్చారని తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, తమకు ఆహ్వానం ఉన్నా విగ్రహం వద్దకు వెళ్లకుండా అడ్డుకుని అవమాన పరిచారని, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికార యంత్రం సహకరించకపోయినా వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకుని ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలని కోరారు. నగరంలోని పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రలో కంచర్ల పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయం సమీపంలో 47 డివిజన్ లో బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు, ది హిందూ సెమియర్ యూత్ వ్యవస్ధాపకుడు ముడవత్ అనిల్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద బీఆర్ ఎస్ రాష్ర్ట నాయకులు, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డితో కలిసి పూజలు చేశారు. దీంతో స్వామివారి పెద్ద లడ్డును బీఆర్ ఎస్ నాయకులు సింగం లక్ష్మి రామ్మోహన్ దంపతులు కలసి కంచర్లకు అందజేశారు. అక్కడ నుంచి పలు డివిజన్స్ లో ఏర్పాటు చేసి విగ్రహాల వద్దకు వెళ్లి పూజలు చేసి శోభాయాత్రలో పాల్లొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల నియోజకవర్గ కాంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, నగరపార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, తిప్పర్తి, నల్లగొండ, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగొని యాదయ్య, మాజీ ఎంపీపీ కరీం పాషా, బొజ్జ వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కొందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, రావుల శ్రీనివాసరెడ్డి, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లి శివశంకర్, తగుళ్ల శ్రీను, పెండెం ధనుంజయ, రాపోలు వెంకన్న, తిప్పర్తి, నల్లగొండ మండల మహిళా అధ్యక్షులు కోండ్ర స్వరూప, కొప్పోలు విమలమ్మ, పెఱిక ఝాన్సీ, జహంగీర్, రవీంద్ర చారి పాలొన్నారు.

‘వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం’