PM Modi | అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్లో జీ20 సదస్సుకు హాజరు
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా వెళ్లబోతున్నారు. డిసెంబర్లో జరిగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా వెళ్లబోతున్నారు. డిసెంబర్లో జరిగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో అమెరికా, ఫ్లోరిడాలోని ట్రంప్ నేషనల్ డోరల్ మియామి రిసార్ట్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు జీ20 దేశాల అధినేతలు హాజరవుతారు. మోదీ అమెరికా పర్యటన దాదాపు ఖరారైనప్పటికీ.. ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
మోదీ ఈ సదస్సుకు హాజరైతే అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రధానంగా వ్యాపారం, వాణిజ్యం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఇటీవల ఇండియాపై అమెరికా విధిస్తున్న సుంకాలపై చర్చలు జరుగుతాయి. రష్యా, ఇరాన్ నుంచి చమురు కొంటున్నందున ఇండియాపై అమెరికా భారీ సుంకాలు విధిస్తోంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధించాలని ట్రంప్ నిర్ణయించారు. తమ దేశంలో జరగబోయే జీ20 సదస్సులో ట్రంప్ కలవాలని అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది మోదీ కోసమే అని ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు.
మోదీ, ట్రంప్ గత జూన్‌లో ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగిన జీ7 సదస్సులో కలుసుకున్నారు. ఈ సందర్బంగా ట్రేడ్, రక్షణ, ఎనర్జీ, టెక్నాలజీ వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. జీ20 సదస్సుతోపాటు క్వాడ్ సదస్సు కూడా డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉంది. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా వంటి దేశాలు క్వాడ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. మోదీ అమెరికా పర్యటన తర్వాత పక్కనే ఉన్న కెనడాలో కూడా పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- g20 summit
- Pm Modi
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

