– జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్ ఇవ్వాలి
– నల్లగొండలో న్యాయవాదుల ధర్నా
రామగిరి, సెప్టెంబర్ 23 : న్యాయవాదులకు రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్ రూ.25 లక్షలు ఇవ్వాలని అలాగే జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్ ఇవ్వాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నల్లగొండ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నలగొండ కోర్టు ముందు న్యాయవాదులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సూచన మేరకు న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టు కాంప్లెక్స్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2026 ఆగస్టు 15, 16 లలో కేరళం రాష్ట్రం ఎర్నాకుళంలో జరిగిన ఐలు జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు చెప్పారు.
కేంద్ర న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం-2001ను సవరించి, న్యాయవాదుల మరణం లేదా పదవీ విరమణ సందర్భంలో రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు వైద్య సహాయంగా రూ.5 లక్షలు, జూనియర్ న్యాయవాదులకు కనీసం ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.10 వేల స్టైపెండ్ మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్ష కార్యదర్శులు ఏ.సతీష్ కుమార్, బి.అశోక్ కుమార్, సీనియర్ న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాస్ రెడ్డి, ఐలు జిల్లా నాయకులు పి.బ్రహ్మచారి, సత్తయ్య, యాదయ్య, వంశీకృష్ణ, నాగిరెడ్డి, దుర్గాప్రసాద్, సింగం శ్రీనివాస్, ఠాగూర్, సత్తయ్య, లాలయ్య, జమిల్, మసీదున్, భీమగాని గణేష్, సంపత్ కుమార్, జి. కిశోర్ కుమార్, డి.నర్సాజి, పోలగోని శ్రీకాంత్, శివమణి, గిరి, పరమేశ్, లెనిన్ బాబు, సిహెచ్ గోపాల్, భాస్కర్ రెడ్డి, కామేష్, అప్రోజ్, జలంధర్, గిరి, లింగయ్య ,అజ్మీర్, నగేష్, వి.లింగయ్య, శ్రీను, బుచ్చి రాములు పాల్గొన్నారు.