Nirmala Sitaraman | డబ్బులు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదు.. కేంద్ర ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు..!
Nirmala Sitaraman | కేంద్ర ఆర్థికమంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేదరికం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇల్లు, తాగునీరు, వైద్యం వంటి కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోవడం పేదరికం కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు లింక్డిన్లో నిర్మల సుదీర్ఘ పోస్టు పెట్టారు.
Nirmala Sitaraman : కేంద్ర ఆర్థికమంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేదరికం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇల్లు, తాగునీరు, వైద్యం వంటి కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోవడం పేదరికం కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు లింక్డిన్లో నిర్మల సుదీర్ఘ పోస్టు పెట్టారు.
భారత్లో 50 కోట్ల మంది కటిక పేదరికాన్ని జయించారంటూ ప్రపంచబ్యాంక్ నివేదిక వెలువరించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ పోస్ట్ చేశారు. ‘డబ్బు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదు. ఇల్లు, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందుబాటులో ఉండాలి. ఒక్క తీవ్రమైన అనారోగ్యం కుటుంబాన్ని కటిక పేదరికంలోకి నెట్టేస్తుంది’ అని నిర్మలా సీతారామన్ తన పోస్టులో పేర్కొన్నారు.
గడిచిన పదేళ్లలో భారత్ పేదరికాన్ని అధిగమించిందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. మోదీ సర్కారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చొరవతోనే ఇది సాధ్యమైందని అన్నారు. 2011-23లో దేశంలో దాదాపు 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారంటూ ప్రపంచబ్యాంక్ నివేదిక ఇవ్వడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు చివరి వ్యక్తికి చేరేవరకు ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తారని నిర్మల తెలిపారు.
అంత్యోదయ లక్ష్యంతో స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ముద్ర రుణాలు వంటి పథకాలు లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సర్కారు పనిచేస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirmala Sitaraman | డబ్బులు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదు.. కేంద్ర ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు..!
YSRCP complaints | పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
క్షుద్రపూజల కోసం.. పొరుగువారి కుమార్తెను చంపిన మహిళ
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలన
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : మాజీ ఎంపీ మాలోత్ కవిత
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

