క్షుద్రపూజల కోసం.. పొరుగువారి కుమార్తెను చంపిన మహిళ
Woman Kills Neighbour's Daughter | ఇంటి బయట ఆడుకున్న బాలిక అదృశ్యమైంది. పోలీస్ డాగ్‌తో పోలీసులు గాలింపు చేపట్టగా పొరుగింటి మహిళ ఇంట్లో ఆ చిన్నారి మృతదేహం లభించింది. క్షుద్ర పూజలో భాగంగానే బాలికను ఆమె హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
లక్నో: ఇంటి బయట ఆడుకున్న బాలిక అదృశ్యమైంది. పోలీస్ డాగ్‌తో పోలీసులు గాలింపు చేపట్టగా పొరుగింటి మహిళ ఇంట్లో ఆ చిన్నారి మృతదేహం లభించింది. క్షుద్ర పూజలో భాగంగానే బాలికను ఆమె హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళను అరెస్ట్ చేశారు. (Woman Kills Neighbour’s Daughter) ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భుద్ ప్రాంతంలో నివసించే మూడేళ్ల వానియా, శనివారం ఉదయం తన ఇంటి బయట ఆడుకున్నది. ఆ తర్వాత ఆ చిన్నారి అదృశ్యమైంది. ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆ చిన్నారి కోసం అంతటా వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఇంటి సమీపంలోనే ఆ చిన్నారి అదృశ్యమైనట్లు గ్రహించారు. పోలీస్ డాగ్‌ను రప్పించారు. చిన్నారి దుస్తుల్లో ఒక దానిని వాసన చూపించారు. ఆ జాగిలం పొరుగున ఉన్న ఒక ఇంటిలోకి పోలీసులను తీసుకెళ్లింది. అక్కడ ఒక సంచిలో చిన్నారి మృతదేహం కనిపించింది.
మరోవైపు బాలిక నోట్లో గుడ్డలు కుక్కడంతోపాటు చేతిపై కత్తి గాయం ఉండటాన్ని పోలీసులు గమనించారు. పొరుగున నివసించే మహిళ క్షుద్ర పూజలు చేస్తుందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో క్షుద్ర పూజల్లో భాగంగానే ఆ చిన్నారిని ఆమె హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ మహిళ ఇంటి వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాగా, చిన్నారి హత్యకు కారణంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
క్షుద్రపూజల కోసం.. పొరుగువారి కుమార్తెను చంపిన మహిళ
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలన
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎంపీ మాలోత్ కవిత
Health tips | ఈ చెట్టు ఆకులతో మధుమేహం, ఊబకాయం రెండింటికీ చెక్ పెట్టొచ్చట.. ఎలాగో తెలుసా..!
Motkupalli Narsimhulu | రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే దళితుల పట్ల చులకన భావం : కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

