YSRCP complaints | పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
YSRCP complaints | ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం పాల్పడుతున్నఅక్రమాలపై వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అమరావతి : ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం పాల్పడుతున్నఅక్రమాలపై వైసీపీ ( YCP ) నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ( SEC Complaints ) చేశారు. వైసీపీ నాయకులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలతా రెడ్డి ఆరోపించారు.
తమ అభ్యర్థులతో స్వేచ్ఛగా నామినేషన్లు వేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు జరిగిన, జరుగుతున్న అక్రమాలపై వెనువెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
నామినేషన్లు వేసినా కూడా వాటిని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదని విమర్శించారు. కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించి వ్యహరిస్తున్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేయకుండా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YSRCP complaints | పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
క్షుద్రపూజల కోసం.. పొరుగువారి కుమార్తెను చంపిన మహిళ
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలన
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : మాజీ ఎంపీ మాలోత్ కవిత
Health tips | ఈ చెట్టు ఆకులతో మధుమేహం, ఊబకాయం రెండింటికీ చెక్ పెట్టొచ్చట.. ఎలాగో తెలుసా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

