కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది.. 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్గొండ జిల్లా: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నార్కెట్‌పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను చిరుమర్తి లింగయ్య తనిఖీ చేసి, లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
‘‘కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అందిన విద్యుత్ కంటే మెరుగైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు అప్పుల పాలవుతున్నారు. లాగ్‌బుక్‌లో కరెంట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయిందనే వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం ఆందోళనకరం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనిఖీకి వస్తున్నారని తెలిసి కూడా వివరాలు నమోదు చేయకపోవడం సిగ్గుచేటు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు.. ఎక్కడైనా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్న ప్రాంతాన్ని చూపించే దమ్ముందా?
రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకుని, విద్యుత్ సరఫరాలో ఉన్న సమస్యలను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. రైతు సంక్షేమమే లక్ష్యంగా.. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

