మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం పేరుతో విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.