టేకులపల్లి, మార్చి 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు జడ్పీ హైస్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, ఫ్యాడ్స్, స్కేల్లు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రావిటీ స్కూల్, బీజేపీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు బోడా పుణ్యానాయక్ ఆధ్వర్యంలో, బీజేపీ టేకులపల్లి మండల యువ మోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తగూడెం జిల్లా మహిళ అధ్యక్షురాలు గంగాబాయి, గ్రావిటీ స్కూల్ ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, బీజేపీ నాయకులు నవీన్, రాందాస్ నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.