తుంగతుర్తిలో సావిత్రిబాయి పూలే వర్ధంతి
సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా..
తుంగతుర్తి, మార్చి 10 : సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడుకొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజ అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల విద్య కోసం, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి చేసిన కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూనికి సాయిలు, గోపగాని రమేశ్ గౌడ్, గోపగాని శ్రీను, తడకమళ్ల మల్లికార్జున్, వెంకన్న, కడియం గోపి, లతీఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

