టేకులపల్లి, మార్చి 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకాన్ని మండల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆశ్రమ పాఠశాల (ఏహెచ్ఎస్) కోయగూడెంలో ఎంపీడీఓ బైరు మల్లీశ్వరి, పీఎంహెచ్ బాలుర హాస్టల్లో ఎంఈఓ జగన్ వేర్వేరుగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు విధానాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వంటగదుల పరిశుభ్రత, భోజన పదార్థాల నాణ్యత, నిల్వ విధానం వంటి అంశాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. నాణ్యమైన భోజనం పెడుతున్నారా, నాణ్యతతో వండుతున్నారా వంటి విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు