కారేపల్లి, మార్చి 10 : కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మల్లాది సుబ్బమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ను మంగళవారం వితరణగా అందజేశారు. విద్యార్థుల సౌకర్యం కోసం రూ.20 వేల విలువైన కంప్యూటర్ను మల్లాది సుబ్బమ్మ కుమార్తె విజయలక్ష్మి- పట్టాభి రామారావు దంపతుల చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ విజయ కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది దంపతులను సన్మానించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ అందజేత